Tuesday, 13 June 2017

విద్యార్థులతో పనులు చేయించడం మానుకోవాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్..

విద్యార్థులతో పనులు చేయించడం మానుకోవాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్.. 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 13  (వుదయం ప్రతినిధి);  పాఠశాలల్లో విద్యార్థులతో పనులు చేయించడం మానుకోవాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున రెబ్బెనలోని జెడ్.పి.హెచ్.ఎస్. పాఠశాలకు ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో సందర్శనకు వెళ్ళగా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాల గేట్ కు పెయింటింగ్ వేస్తు ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చెర్పించాలని ఒక పక్క బాడి బాట కార్యక్రమాలు నిర్వహిస్తు మరో పక్క విద్యార్థులతో పనులు చేయించడం సబబు కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో సర్వే నిర్వహించి సమస్యల పరిష్కారం కొరకు ఆందోళనలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి, డివిజన్ కార్యదర్శి పుదారి సాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment