Friday, 2 June 2017

ఘనముగా తెలంగాణ సంబరాలు

  ఘనముగా   తెలంగాణ సంబరాలు


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 02  (వుదయం ప్రతినిధి); తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రెబ్బెనలో  ఘనంగా జరుపుకున్నారు  తెలంగాణ రాష్ట్రము కోసం  ఎన్నో ఉద్యమాలు చేసి, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సం  అయిన సందర్భంగా శుక్రవారం ఎం పిడి ఓ కార్యాలయంలో   ఎంపీపీ  సంజీవ్ కుమార్  జెండాను ఎగురువేసి తెలంగాణ తల్లి చిత్ర పటానికి మరియు అమరవీరుల స్థూపానికి  పూలమాలలు వేశారు  అన్ని గ్రామాల్లో గ్రామా  సర్పంచ్‌లు జెండాను ఎగుర వేసి తెలంగాణ తల్లికి పులా మాల వేసి అమర విరులకు ఘన నివాళి అర్పించారు అనంతరం తహసిల్దార్ కార్యలయంలో బండారి  రమేష్‌గౌడ్‌ జాతీయ పతాకం ఎగుర వేసి తెలంగాణ తల్లి కి పూల మాల వేసి నివాళులు అర్పించారు.   జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ  ఈ కార్యక్రమంలో జడ్ పి టి సి  అజ్మీర బాపూరావు,ఎంపీడీఓ సత్యనారాయణసింగ్,ఏఎం సి అధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ,  ఉప అధ్యక్షురాలు రేణుక,ఎపీ ఎం వెంకటరమణ , సర్పంచ్‌ పెసర వెంకటమ్మ,ఉప సర్పంచ్ శ్రీధర్,చెన్న సోమషేకర్,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోటు  శ్రీధర్ రెడ్డి,టీఆర్‌ఎస్‌ తూర్పు జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాలస్ టీఆర్‌ఎస్‌ నాయకులు సుదర్శన్ గౌడ్, చిరంజీవి గౌడ్ ,సింగిల్ విండో డైరెక్టార్ మదునయ్య, వెంకన్న,     తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment