కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 ; రెబ్బన ; రెబ్బెన మండలం ధర్మారం గ్రామంలో ఈ నెల 27న హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమచారి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న భూ వివాదంలో తమ్ముడు లచ్చయ్య (35) ను హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్ ను అదుపులోకి తీసుకోవడానికి సర్కిల్ ఇన్సపెక్టర్ పర్యవేక్షణలో ఎస్సై శివకుమార్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి పోలీసు బృందం వలపన్ని అతడి ఇంటివద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని ఆసిఫాబాద్ జిల్లా కోర్ట్ కు రిమాండ్ చేసినట్లు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి 48 గంటలలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీస్ బృందానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ అభినందనలు తెలిపారు.
Excellent news
ReplyDelete