కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 20 రెబ్బెన ; తెలంగాణ రాష్ట్రం లో గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి డిమాండ్లను నెరవేర్చాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ రెబ్బెన స్థానిక ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ కి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతు గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఎన్నో ఏండ్లుగా చాలి చాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తూ పంచాయితీల అభివృద్ధికి పాటుపడుతున్నా కార్మికులకు వారి కష్టాన్ని ఇప్పడికైనా గుర్తించి వారిని మున్సిపాలిటీ ఉద్యోగుల గుర్తించి వేతనాలు చెల్లించాలని కోరారు, కరోబర్ లను పంచాయతీ కార్యదర్శిలుగా గుర్తించాలని,గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడం లో విఫలమవుతున్నందున కార్మికుల హక్కుల సాధనకై తప్పని సరి పరిస్థులల్లో సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. జులై 20వ తేదీ లోగ ప్రభుత్వం స్పందించని యెడల నిరవధిక సమ్మె చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రాయిల్ల నర్సయ్య,శెంకర్, పంచాయితీ కార్మికులు నాగవల్లి సుధాకర్,పి వీరయ్య,ఆర్ రమేష్,దేవమ్మ,దేవాజి,రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment