దేశం గర్వించే క్రీడాకారులు గా ఎదగాలి ; సి ఐ పురుషోత్తం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 3 రెబ్బెన: దేశం గర్వించే క్రీడాకారులు మండలం నుంచి తయారు అవ్వాలని రెబ్బెన సి ఐ పురుషోత్తం అన్నారు , సోమవారం రెబ్బెన మండలం లోని సింగరేణి పాఠశాల నందు జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగేన వార్ ఆదేశాల మేరకు పోలీస్ లు మీకోసం లో బాగం గా మండల స్థాయి క్రీడాపాఠశాల ల ఎంపిక ను రెబ్బెన సి ఐ పురుషోత్తం మరియు రెబ్బెన ఎస్సై శివకుమార్ లు ప్రారంబించారు. మండలం లోని వివిధ పాఠశాల ల నుంచి వచ్చిన విద్యార్థుల యొక్క ఎత్తు , బరువు తో పాటు 7 టెస్ట్ ల ప్రతిభ నుక్రమ పద్ధతి లో నమోదు చేసి మండల స్థాయి ఎంపిక ను పూర్తి చేశారు. జిల్లా స్థాయి ఎంపిక పోటిలకు ఎంపిక చేస్తారని ఎంపిక పూర్తి గా పారదర్శకం గా జరుగుతుందని ఎంపిక ను జిల్లా ఎస్పి పర్యవేక్షణ లోని ప్రత్యెక టీం మరియు జిల్లా స్పోర్ట్స్ అధికారులు పూర్తి చేస్తారని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి లో కూడా ఎంపిక కాబడిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్షకు పంపుతారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం లు చేశారు. ఈ కార్యక్రమము లో సింగరేణి పాఠశాల PET భాస్కర్, అథ్లెట్లు మల్లేష్ , నరేష్ , రవీందర్ సతీష్ , రమేష్, ఎంపిక పరిక్షల పర్యవేక్షకులు గా రవీందర్, మనోహర్, సాయి కిరణ్, భాను ప్రసాద్ , కృష్ణ, మల్లేష్, రాజేష్, స్కౌట్స్ అంజలి , లక్ష్మి , సుప్రియ మరియు గోలేటి సింగరేణి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment