కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 16 రెబ్బెన: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సింగరేణిలో స్వచ్ఛత పక్షోత్సవాల శనివారం బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జెనరల్ మేనేజర్ కె రవి శెంకర్ ప్రారంభించారు. ఏరియాలోని వివిధ గనులు, విభాగాల్లో తొలి రోజున స్వచ్ఛత పక్షోత్సవాల సందర్భంగా కార్మికుల మరియు అధికారులతో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయడమే కాకుండా అధికారులు, కార్మికులంతా వారి వారి కార్యాలాయాలు, గనుల ఆవరణలో చెత్తను తొలగించారు.బెల్లంపల్లి ఏరియాలోని బీపీఏ ఓసీపీ-2 ఎక్స్ టెన్షన్ లో ప్రాజెక్టు అధికారి చింతల శ్రీనివాస్ నేతృత్వంలో ఖైరగూడలో ప్రాజెక్టు అధికారి మోహన్‌రెడ్డి, మేనేజర్ శ్రీరమేశ్, డోర్లీ ఓసీపీలో మేనేజర్ ఉమాకాంత్ నేతృత్వంలో, ఎక్స్ ప్లోరేషన్ విభాగంలో అదనపు జీఎం సీతారామరావు నాయకత్వంలో, ఏరియా ఆసుపత్రిలో డీవైసీఎంవో అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో, ఏరియా వర్కుషాప్‌లో ఇంజినీర్ రఘురాం,ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్షోత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత కోసం నడుం బిగించాలని, గాంధీజీ కలలు కన్న పరిశుభ్ర భారతావని కోసం అందరం పునరంకితమై పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. 15 రోజుల పాటు స్వచ్ఛతా పక్షోత్సవాలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న సింగరేణీ సంస్థను స్వచ్ఛత సూచీలోనూ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలపాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమాల్లో ఆయా గనుల్లోని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శులు కూడా పాలుపంచుకున్నారు.
No comments:
Post a Comment