కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 12 ; రెబ్బెన: రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెరాస మహిళా విభాగం నుంచి మన్యం పద్మ,అన్నపూర్ణ అరుణ ల ఆధ్వర్యంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు అల్పాహారం పంపిణి చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు.ప్రభుత్వాస్పత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం మా వంతుగా సేవా దృక్పధం తో అల్పాహారం పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని అన్నారు..తెరాస మహిళా విభాగం తరుపున భవిష్యత్ లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment