Saturday, 9 June 2018

టాస్క్ ఫోర్స్ దాడుల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 9  రెబ్బెన :   మండలం  తక్కల్లపల్లి గ్రామంలో నకిలీ విత్తనాలు కలిగి ఉన్నారనే ఖచ్చితమైన సమాచారంతో టాస్క్ ఫోర్స్ టీం సి.ఐ. అల్లం రాంబాబు నేతృత్వంలోని సిబ్బంది  ప్రసాద్, వెంకటేష్ లు శెనివారం  తెల్లవారుజామున 4.00 గం.లకు  గ్రామంలో తనిఖీలు నిర్వహించగా తక్కల్లపల్లి గ్రామంలోని పుప్పాల పోచయ్య ఇంట్లో  అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 14,400/- విలువ చేసే 6 కేజీ ల నకిలీ పత్తి విత్తనాలు లభించాయని  వీటిని ఆంధ్ర ప్రాంతానికి చెందిన క్రిష్ణ (రోల్లపాడు గ్రామం) వద్ద కొనుగోలు చేసినట్లు తెలిసిందని ,అదే గ్రామంలోని విడిదినేని చంద్రయ్య ఇంట్లో తనిఖీ చేపట్టగా  సుమారు 18,800/- విలువ చేసే 7 కేజీల నకిలీ పత్తి విత్తనాలు లభించాయని . వీటిని అదే గ్రామానికి చెందిన వొడ్నాల సురేష్ అనే మధ్యవర్తి ద్వారా భీమినికి  చెందిన ఒక వ్యాపారి దగ్గర తీసుకున్నట్లు తెలిసిందన్నారు. వీటన్నింటిని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం రెబ్బెన  పిఎస్. వారికి  అప్పగించడం జరిగింది.అన్నారు. 

No comments:

Post a Comment