Monday, 18 June 2018

తెరాస ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి ఏఐవైఎఫ్ నాయకులకు లేదు

   
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 రెబ్బెన ; తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు  సిఎం కేసీఆర్ ని  విమర్శించే స్థాయి ఎఐవైఎఫ్ నాయకులకు లేదని  టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మస్క  రమేష్ అన్నారు. సోమవారం గోలేటిలోని  తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కెసిఆర్ను విమర్శించే స్థాయి ఎఐవైఎఫ్ నాయకులకు లేదని ముఖ్యమంత్రి కెసిఆర్  బంగారంగా తెలంగాణలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను,పథకాలు  చేపడుతు అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా అనేక  కార్యక్రమాలను చేస్తున్నారని అన్నారు.అవే సంక్షేమ పథకాలు కెసిఆర్ ప్రవేశ పెట్టడం జరిగిందని అందులో భాగంగా ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధజలాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.  ప్రతి ఒక్క రైతు భూమికి  చివరి ఆయకట్టు వరకు నీరు అందించే ఉద్దేశంతో మిషన్ కాకతీయ ద్వారా నీటిని అందించి ప్రతి రైతు పంటను పండించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు నిరుద్యోగులకు టిఎస్ పిఎస్ ద్వారా  యాభై ఆరు వేల పైచిలుకు ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీచేయడం  జరిగిందన్నారు అందులో భాగంగా ఇప్పటివరకు సుమారు ముప్పై అయిదు వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని మిగిలిన ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నదని అన్నారు.అందులో భాగంగా ఇప్పటి వరకు కొన్ని ఉద్యోగాలు చిల్లర రాజకీయ నాయకులు కోర్టుకు వెళ్లడం ద్వారా కోర్టులో పెండింగ్లో ఉండటం జరిగిందని ఘాటు గా  విమర్శించారు.ఐనప్పటికీ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను  దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఐపాస్ ద్వారా అనేక పరిశ్రమలను ఏర్పాటు చేసి కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నతరుణంలో ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారని దేశం మొత్తంలో తమ ఉనికిని  కోల్పోతున్నామని భయంతో  స్వార్థ రాజకీయాల కోసం పని కట్టుగొని  తెలంగాణ ప్రభుత్వం మరియు కేసిఆర్ పై  బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  అంతేకాకుండా మరోసారి కేసీఆర్ ని  విమర్శిస్తే సహించేది లేదని మరోసారి ఈ విదంగా చేస్తే ఊరుకునేది లేదని  ఏఐవైఎఫ్ నాయకులను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.  ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు పర్వతి అశోక్, డివిజన్ నాయకులు ఓరుగంటి రంజిత్,  మండల నాయకులు యనమల శ్రీకాంత్, పరి పరికిపండ్ల సతీష్, పూదరి రాజ్కుమార్, నాయకులు ప్రశాంత్, పోతురాజుల వెంకటేష్, రవీందర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment