కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 14 ; రెబ్బెన: ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలను సాదించేందుకు కొమరం భీం జిల్లా పోలీసుల అధ్వర్యములో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు రెబ్బెన మరియు తిర్యాణి మండలాల నుండి అనూహ్యంగా 285 మంది అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఉదయము 5 గ: గంటలకు రెబ్బెనా ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ వద్దకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మరియు ఫీజికల్ మేజర్ మెంట్స్ కై హాజరు అయినట్లు ఏఎస్పి గొద్రు,డిఎస్పి సత్యనారాయణ తెలిపారు.అంతరం వారు మాట్లాడుతు పోలీస్ శిక్షణ కై హాజరైన అభ్యర్థుల యొక్క ధ్రువ పత్రాలు పరిశీలించి వారి యొక్క ఎత్తును నమోదు చేశామన్నారు.ఈ యొక్క ప్రీ సెలక్షన్ టెస్టులకు రెబ్బెన మండలం నుండి 39 మంది మహిళా అభ్యర్థులు,153 మంది పురుషులు మరియు తిర్యాణి మండల కేంద్రం నుండి 24 మంది మహిళలు,69 మంది పురుషులు పాల్గొన్నట్లు తెలిపారు ఈ ఫ్రీ సెలెక్స్టీన్ సందర్బంగా రెబ్బెన సీఐ పురుషోత్తమ చారి, రెబ్బెన ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు
No comments:
Post a Comment