Wednesday, 6 June 2018

అజ్మీరా సాయికృష్ణ జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరం:



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 6  రెబ్బెన:: మండల కేంద్రంలో ఆర్&బి అతిధి గృహ ఆవరణలో బుధవారం నాడు అజ్మీరా సాయికృష్ణ జ్ఞాపకార్థం జనని వాలంటరీ బ్లెడ్ బ్యాంక్ వారి సహాయంతో  రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు.ఈ రక్తదాన శిబిరాన్ని రెబ్బెన మండల తహశీల్దార్ సాయన్న మరియు ఎంపిపి కర్నాధం సంజీవకుమార్ లు ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు సృష్టిలో ఒక్క మనిషికే ఇంకో మనిషి ప్రాణాలు నిలబెట్టే అవకాశం రక్తదానం వల్ల కలుగుతుంది అని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయవచ్చని సుమారు 45 రోజులవరకు నిలువ ఉంటుందని అత్యవసర సమయాల్లో రోగులకు ఈ రక్తాన్ని ఇచ్చి ప్రాణాలు కాపాడుకోవచ్చని కావున ప్రజలు ఈ విషయం పై అవగాహనా కలిపించుకొని ఎటువంటి అపోహలు  కలిగించుకోకుండా రక్తదానం చేయాలని అన్నారు ఈ విషయంలో ముందుకు వచ్చిన రక్తదాతలకు ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ వెంకటమ్మ,ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్,వార్డుమెంబర్ మడ్డి శ్రీను,విఆర్వో ఉమ్లాల్,ప్రవీణ్,శ్రీనివాస్,రాయిళ్ల నర్సయ్య,శెంకర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment