Saturday, 2 June 2018

కల్వర్టు ఢీకొని బొలెరో వాహనం బోల్తా ; అక్కడిక్కడే న‌లుగురు మృతి

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 2 ; రెబ్బెన;  బెల్లంపల్లి ఏరియా లోని రెబ్బెన మండల కేంద్రంలో చోపిడి వద్ద  ఉన్న కల్వర్టును ఢీకొని ఉన్న లోయలో పడి  బొలెరో(ఎం ఎచ్ 34 ఏవి 1618) వాహనం బోల్తా పడి న  ప్ర‌మాద  ఘటనలో శని వారం  న‌లుగురు వ్యక్తులు అక్కడిక్కడే  మృతి చెందారు.చోపిడి బ్రిడ్జ్ కి అదుపు తప్పి లోయలో పడిపోవడం తో   డ్రైవర్ మొహ్మద్ ఇథియాజ్ {34},బళ్ల కోటేశ్వర్ రావు (53)(గోదావరిఖని ఎన్టీపీసీ) చేరన్  కుమార్ (35) , దుర్గా రావు లు (45) మృతి చెందారు.         సంఘటన స్థలాన్ని రెబ్బెన సీఐ పురుషోత్తం చారి మరియు ఎస్ఐ శివకుమార్ లు  హుటా హుటిన వెళ్లి  పరిశీలించి మృతదేహాల్ని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. .మరణించిన వ్యక్తులు విధి నిర్వహణలో భాగంగా ప్రతి వారం రామగుండం గోదావరిఖని నుండి సింగ‌రేణి  ఓపెన్ కాస్ట్ డిబిఎల్ సబ్ డెకో కంపెనీకి చెందిన కాంట్రాక్టు కార్మికులుగా   డిబిఎల్ కంపెనీకి చెందిన వాహనాల మెంటనెన్సులు చేస్తారని  తెలిపారు.

No comments:

Post a Comment