Sunday, 3 June 2018

తెలంగాణ క్రీడా పాఠశాలలలో 4వ తరగతిలో ప్రవేశాల కొరకు మండల స్థాయిలలో ఎంపికలు.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 3 ; రెబ్బెన; రెబ్బెన మండల స్థాయిలో ఎంపిక పోటీలు గోలేటి లోని భీమన్న క్రీడా మైదానంలో రేపు అనగా  జూన్ 4వ తేదీన ఉదయం 7.00 గంటల నుండి నిర్వహించబడతాయి.ఇట్టి అవకాశాన్ని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరు.విద్యార్థులు వచ్చేటప్పుడు 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్,4వ తరగతి  చదువుతున్నట్లు ధ్రువీకరణ పత్రాలు (బోనఫైడ్) తీసుకురావాలని రెబ్బెన మండల విద్యాధికారి యం వెంకటేశ్వర స్వామి తెలిపారు. ఈ ఎంపిక పోటీలు జిల్లా విద్యా శాఖ మరియు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.

No comments:

Post a Comment