కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; రెబ్బెన; జూన్ 29 ; తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల సాధన కోసమే జులై 5వ తేదీ తరువాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉపేందర్ మరియు టిఆర్ఎస్ కెవి జిల్లా కార్యదర్శి ఎన్ సుధాకర్ అన్నారు శుక్రవారం సమ్మెకు సంబంధించిన కరపత్రాలు రెబ్బెనలోని ఆర్&బి గెస్ట్ హౌస్ ఆవరణ లో విడుదల చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 40 సవంత్సరాల నుండి చాలి చాలని వేతనాలు తీసుకుంటూ, పస్తులు ఉంటు,గ్రామము అభివృద్ధి చెందడం లో కార్మికుల పాత్ర కీలకంగా పోసిస్తున్నారని అయినప్పటికీ వారికి నెల నెల జీతాలు ఇవ్వడం లేదని, దీంతో వారు అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నారని గతంలో సమ్మె చేసినప్పుడు రాష్ట్ర మంత్రువర్యులు కేటీఆర్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్థానాన్ని హామీ ఇచ్చారని నేటివరకు దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు, దేశంలో వివిధ రాష్ట్రాలో ఇస్తున్నట్లు వారికి నెలకు కనీస వేతనాలు18 వేలు ఇవ్వాలని,అలాగే రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు,సీనియర్ కారొబార్లను పంచాయతీ కార్యదర్శి గా నియమించాలని కోరారు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రతి నెల జీతాలు బ్యాంక్ ద్వారా చెల్లించాలని తదితర హక్కుల సాధన కోసం జులై 3 మరియు 4వ తేదీ లలో రెబ్బన మండల కెద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా ఉంటుందని జులై 9వ తేదీ న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుందని అయిన్నప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మె ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి నర్సయ్య నాయకులు శెంకర్ కారోబార్లు్ ఎస్. తిరుపతి ప్రకాష్ దేవాజి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment