Tuesday, 5 June 2018

మానసికంగా వేదనతో ఉరివేసుకుని మహిళ మృతి

రెబ్బెన:కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 3  రెబ్బెన: మండలం లోని  పులికుంట గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున  బద్ది  మౌనిక(30) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు రెబ్బెన హెడ్ కానిస్టేబుల్  బి  శ్రీనివాస్  తెలిపారు. ప్రాధమిక సమాచారం  మేరకు ఆత్మహత్యకు పాల్పడిన మహిళా మౌనిక 6 సంవత్సరాల క్రితం వివాహం అయింది  భర్త మహేందర్  టక్టర్ డ్రైవర్ గా విధులు కొనసాగిస్తూ 3 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు మరణించ్చాడు.  భర్త చనిపోయినప్పటి నుండి  మానసికంగా కృంగిపోయి ఎవరితో మాట్లాకుండా ఉండేదని  ఆ క్రమంలో ఇంట్లో వాళ్లందరూ నిద్రిస్తున్న సమయంలో బాత్రూంలో ఉరి వేసుకుని  ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై శివకుమార్ పరిశీలించారు. మృతురాలికి  ఒక బాబు, పాప ఉన్నారన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

No comments:

Post a Comment