కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 27 ; రెబ్బన ; అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న భూ వివాదం తమ్ముడి హత్యకు దారితీసింది. బుధవారం ఈ ఘటన రెబ్బెన మండలం ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్సపెక్టర్ పురుషోత్తమచారి తెలిపిన వివరాల పకారం రెబ్బెన మండలం ధర్మారం గ్రామానికి చెందిన నాయని ల్లచయ్య, వెంకటేష్ లు అన్నదమ్ములు. గత కొద్దిరోజులుగా వారి మధ్య భూమికోసం గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. బుధవారం వారి మధ్య చోటు చేసుకున్న వివాదం ముదిరి లచ్చయ్య (35) ను వెంకటేష్ గొడ్డలితో మెడమీద అతి కిరాతకంగా నరికిచంపినట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ పురుషోత్తమచారి, ఎస్సై శివ కుమార్ లు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment