కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 7 రెబ్బెన: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను అన్ని కార్మిక సంఘాలు సంఘటితంగా వ్యతిరేకించాలని కొమురంభీం జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అంబాల ఓదెలు అన్నారు. రెబ్బెన మండలం గోలేటి లోని కే ఎల్ మహేంద్ర భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 11 వతేదినుంచి ఆర్ టి సీ కార్మికులు, 20 వ్ తేదీనుంచి హమాలీలు తలపెట్టిన సమ్మెలకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు , బడా పారిశ్శ్రమిక వేత్తలకు ఆ నుకూలంగా నిర్ణయాలను తీసుకుంటున్నదన్నారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం కూడా కార్మిక ఉద్యమాలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నదన్నారు. పోరాటాల ద్వారానే హక్కుల పరిరక్షణ ఉంటుందన్నారు. జిల్లాలో జరిగిన మహాసభలలో ఈ మేరకు తీర్మానాలు చేయడం జరిగిందన్నారు.జిల్లాలోని అసంఘటిత కార్మికులు సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిరుపతి, కార్యదర్శి భోగే ఉపేందర్, కౌన్సిల్ సభ్యులు జగ్గయ్య, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment