కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 11 ; రెబ్బెన:మండలంలోని రెబ్బెన, గోలేటి మరియు గంగాపూర్ ఆశ్రమ పాఠశాలలలో సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది అంతర్గత అవశేష పిచికారీ నిర్వహించారు.ఈ సందర్బంగా ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతు వర్షాకాలం ప్రారంభం ఐనందున దోమలు ఈగలు ఇతర చీడపురుగుల బారిన పడకుండ ముందస్తు చర్యల్లో భాగంగా ఈ దోమల మందు పిచికారీ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.మొదటి విడతలో భాగంగా రెబ్బెన బాలికల ఆశ్రమ పాఠశాల,గోలేటిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల మరియు గంగాపూర్ లోని కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment