కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని *శ్రీ దుర్గ వైన్స్* నుండి బెల్ట్ షాపులకు మద్యం అక్రమ రవాణా అవుతుందనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో టాస్క్ ఫోర్స్ *సి.ఐ. అల్లం రాంబాబు* నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్,వెంకటేష్ లు సోమవారం తనిఖీలు నిర్వహించరు. ఆసిఫాబాద్ లోని గుండి రోడ్డులో గల *శ్రీ దుర్గ వైన్స్* నుండి చిలాటిగూడ కి చెందిన *బోయిరే తిరుపతి* అనే వ్యక్తి సుమారు 16,200/- విలువగల మద్యం తీసుకొని చిలాటిగూడలోని తన బెల్ట్ షాపుకు తరలించటానికి సిద్దంగా ఉండగా ఖచ్చితమైన నిఘా సమాచారంతో మద్యంతో సహా అతనిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ పొలీస్ వారికి అప్పగించడం జరిగిందని తెలిపారు.
No comments:
Post a Comment