కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 రెబ్బెన ; నిత్యం వాడే పరిసరాలను పరిశుబ్రాంగా ఉంచుకోవాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జెనరల్ మేనేజర్ కె రవి శెంకర్ అన్నారు.సోమవారం గోలేటి టౌన్ షిప్ లో జియం కార్యాలయం నుండి స్వచ్ఛ పక్వడా కార్యక్రమం లో భాగంగా విదులలలో ప్రజలకు అవగాహనా కల్పిస్తు ర్యాలీని నిర్వహించారు.అనంతరం వారు పరిసరాలను శుభ్ర పరచి,అందరితో ప్రతిజ్ఞ చేయించారు సీఎస్పీ వద్ద భారీగా మొక్కలను నాటారు.కార్యక్రమంలో భాగంగా జియం మాట్లాడుతు దేశ ప్రధాని తలపెట్టిన స్వచ్ఛ పక్వడా కార్యక్రమంలో అందరు భాగస్వాములై పరిసరాల పరిశుభ్రతకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజియం వీరస్వామి,డిజిఎం పర్సనల్ కిరణ్,డిజిఎం సివిల్ ప్రసాద రావు,ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి,డివైపియంలు సుదర్శన్,రాజేశ్వర్,కార్మిక నాయకులు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాస్ రావు,సింగరేణి సేవా సంస్థ సభ్యులు సొల్లు లక్ష్మి,కుందారపు శెంకరమ్మ,కుమార స్వామి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment