Sunday, 3 June 2018

టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలలో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 3  రెబ్బెన: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో  టాస్క్ ఫోర్స్  సి. ఐ అల్లం రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్ , వెంకటేష్ లు  గోలేటి క్రాస్ రోడ్ వద్ద అనుమాన్పదంగా  తచ్చాడుతున్న ఇద్దరినీ అదుపులోకితీసుకొని విచారించగా చంద్రాపూర్ కు చందిన   మహమ్మద్ ఇర్ఫాన్ సూర్య . యోగేష్ చంద్రకాంత్ భావనే లుగ తెలిసిందన్నారు. వారిదగ్గర ఉన్న  5 సంచులను విప్పిచూడగా  1,09,800/- విలువగల నిషేదత గుట్కా ప్యాకెట్లు ఉన్నాయని,  వీటిని గోపాల్ రాథోడ్ r/o వసాడే, చంద్రపూర్ అను వ్యక్తికి  సంబంధించినవిగా చెప్పి వారి యజమాని ఆజ్ఞ మేరకు గోలేటిలో ఉన్నటువంటి లోకల్ కిరాణా షాపులకు సరఫరా చేయటానికి వచ్చినామని చెప్పినారు.అలాగే తమవెంట ఒక బైక్( హోండా షైన్ MH 34 BK 6986 )  తెచ్చుకున్నామని చెప్పగా వాటన్నింటిని   స్వాధీనం  చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం రెబ్బెన పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగింది.

No comments:

Post a Comment