కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 రెబ్బెన ; చిన్నారి స్పందనను చిదిమేసిన రాక్షసులను కఠినంగా శిక్షిస్తేనే అప్పుడే స్పందన ఆత్మకు శాంతి చేకూరుతుందని దానితో పాటు వారి కుటుంబానికి న్యాయం జరగాలని.ఈ సందర్బంగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ బస్స్టాండ్ మౌనం పాటించి కొవ్వొత్తులతో ర్యాలీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించరు. అనంతరం సంస్థ అధ్యక్షుడు ఓరగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కి దగ్గరలో సొన్ మండలం కేంద్రంలో స్పందన అనే పది సంవత్సరాల పునరావృతమవుతూనే ఉన్నాయి. చిన్నారి స్పందన కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరియు చిన్నారి హత్యకు కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకసారి మరెవరికైనా ఇలాంటి చిన్న పిల్లలపై లైంగిక దాడులు చేయాలనే ఆలోచన రావాలంటే భయపడే విధంగా ఈ మానవ మృగంలా ప్రవర్తించిన ఈ యువకుడిని శిక్షించాలని మేం కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్, ఓరగంటి రవీందర్, ప్రధాన కార్యదర్శి జనగామ అజయ్ , సహాయ కార్యదర్శి జనగామ విజయ్ కోశాధికారులు ఎగ్గ తిరుపతి, బలుగూరి తిరుపతి సభ్యులు విజయ్,కొట్రంగి శ్రీను, సురేష్ ,శ్రీను, సాయి,రాజశేఖర్, రాజు,కుమార్, వంశీ,అజయ్, గోపాల్ ,అరవింద్,రాజు, లావుడ్యా గోపాల్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment