కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 17 రెబ్బెన ; నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆత్మకూరి చిరంజీవి అన్నారు.ఆదివారం కెఎల్ మహేంద్ర భవన్ లో వారు ఏర్పాటు చేసుకున్న ఏఐవై ఎఫ్ మండల అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతు కేంద్ర రస్తా ప్రభుత్వ సంస్థల్లో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ నోటిఫికెషన్ జారీచేయకుండా కేవలం వారి స్వార్ధ రాజకీయాలను కొనసాగిస్తుందని అన్నారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానమే ఉండదన్న తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుందని విమర్శించారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషిన్ భగీరథ,మిషిన్ కాకతీయ పథకాలు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి అని అన్నారు.యువత చైతన్యమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తిరుగుబాటు బావుట ఎగురవేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఏఐవై ఎఫ్ యువతను చైతన్య పరచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగు బుద్ది చెప్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్,ఏఐవై ఎఫ్ మండల కార్యదర్శి చునార్కర్ మహేందర్,మండల సహాయ కార్యదర్శి రహీం,ఉపాధ్యక్షులు గంధం శ్రీను,ఏఐఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి కిరణ్,గోలేటి ఏఐవై ఎఫ్ కార్యదర్శి దుర్గం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment