Tuesday, 5 June 2018

ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడుదాం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 3  రెబ్బెన: ప్లాస్టిక్ వాడకాన్ని  నియంత్రించి  పర్యావరణాన్ని కాపాడుకుందామని  బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి  జియం కె రవి శెంకర్ అన్నారు.ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్బంగా మంగళవారం జెనరల్ మేనేజర్  కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని  నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏరియా జెనరల్ మేనేజర్ కె రవి శెంకర్ హాజరై మాట్లాడుతు ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్స వాన్ని  భారత దేశం నిర్వహిస్తోందన్నారు.దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ ను,కాలుష్యాన్ని నివారిద్దామని నిర్ణయించడమైనదని తెలిపారు.ఇందుకు గాను మనమంతా ప్లాస్టిక్ వస్తువులు,క్యారీ   బ్యాగులు  సాధ్యమైనంత వరకు వాడటం తగ్గించి పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం అన్నారు.50 మైక్రోన్స్ కంటే మందం తక్కువ గల ప్లాస్టిక్ సంచులను వాడకూడదని మరియు నూలు ,నార, పేపర్  తదితర వాటితో  తయారు చేసిన చేతి సంచులను మాత్రమే వాడాలని సూచించారు.ఈ సందర్బంగా నూలుతో  తయారు చేసిన చేతి సంచులను సింగరేణి అధికారుల సంఘం వారి సౌజన్యంతో పంపిణి చేసారు అనంతరం కాలుష్యం,సహజ వనరులను సక్రమంగా వినియోగించుట,బొగ్గు లోడు  లారీల పై టర్ఫిన్లు కప్పుట గురించి అవగాహన కల్పించే కరపత్రాలను విడుదల చేసారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా జియం కార్యాలయ ఆవరణలో పర్యావరణానికి గుర్తుగా ఆకుపచ్చ ఎల్ఈడి బల్బును ఏర్పాటు చేసారు.చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలుపుతు ఒక చెట్టును పూలతో అలంకరించి అందరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్బంగా సింగరేణి పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్లు జి మోహన్ రెడ్డి,సిఎచ్ శ్రీనివాస్,ఎజియం బిపిఎ సీతారామ రావు,టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ రావు,డిజిఎం సివిల్ ప్రసాద రావు,ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కృష్ణ చారి,క్వాలిటీ అడిషనల్ మేనేజర్ రాజమల్లు,ఎస్టేట్స్ అధికారిని వర లక్ష్మి,ఎస్ఎస్ఓ వర ప్రసాద్,డివైపియం రాజేశ్వర్, రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment