Wednesday, 13 June 2018

స్వేచ్ఛ పక్వడా కార్యక్రమంలో అందరు పాల్గొని విజయవంతం చేయాలి ; కె రవిశంకర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 13  ; రెబ్బెన    స్వేచ్ఛ పక్వడా కార్యక్రమంలో కార్మికులు వారి కుటుంబ సబ్యులు,  అధికారులు  అందరు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి జియం కె రవి శెంకర్ అన్నారు.  ఈ నెల 16 వ తేదీ నుండి 18 వ తేదీ వరకు స్వచ్ఛ పక్వడా కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు తెలిపారు.16 వ తేదీన ఏరియా లోని అన్ని ఘనులు,డిపార్ట్మెంట్లందు స్వచ్ఛ పక్వడా కార్యక్రమాన్ని నిర్వహించి అందరి తో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది అన్నారు. పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు.ఈ నెల 18 వ తేదీన పాఠశాల మరియు సిఎహెచ్పి లలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్బంగా కార్మికులకు వారి కుటుంబ సబ్యులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.దీనిలో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్,వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్లు జి మోహన్ రెడ్డి, శ్రీనివాస్, టిబిజికెఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజు  శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ కిరణ్ కుమార్, డిజిఎం  సివిల్ ప్రసాదరావు,డివైసిఎంవో  అశోక్ కుమార్, డీవైపీఎంలు సుదర్శన్,  రాజేశ్వర్, రామశాస్త్రి ఐఈడి  ఆఫీసర్ యోహాన్,  ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి, యోగా శిక్షకులు  రాజలింగు, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment