Saturday, 9 June 2018

బయో మెట్రిక్ విధానం జవాబుదారి తనం పెరుగుతుంది

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 9  రెబ్బెన :  బయో మెట్రిక్ విధానం వల్ల  ఉద్యోగులలో జవాబుదారి  తనం పెరుగుతుందని  బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం  రవిశంకర్ అన్నారు.  గోలేటి సింగరేణి లో  బయోమెట్రిక్ సిస్టం విధానాన్నిశనివారం  ప్రారంభించారు.ఈ సందర్బంగా జియం రవి శెంకర్ మాట్లాడుతు బయోమెట్రిక్ విధానం వల్ల ఉద్యోగులు సమయపాలన పాటించడం క్రమశిక్షణ కచ్చితమైన హాజరు ఉంటుంది అన్నారు.ఉద్యోగులు మారుతున్న కాలానికి అనుగుణంగా సమయపాలన పాటించాలని  అన్నారు.సమయపాలన పాటించడం వల్ల పనుల్లో వేగం ఉంటుంది అని తెలిపారు.ఈ కొత్తవిధానాన్ని అందరు ఆహ్వనించాలని కోరారు.బయోమెట్రిక్ విధానం లో ఏమైనా లోటుపాట్లు ఇబ్బందులు ఉన్నట్లయితే యాజమాన్యం  దృష్టికి తీసుకురావాలి అన్నారు.ఇక ముందు ఉద్యోగులు ఇన్ మరియు అవుట్ మాస్టర్ బయోమెట్రిక్ విధానం ద్వారా తమ మాస్టర్లు బుక్ చేసుకోవాలి అన్నారు.అనంతరం ఐటి మేనేజర్ నారాయణ మాట్లాడుతు ఉద్యోగులు బయమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకొని.బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాస్ రావు,డిజిఎం పర్సనల్ కిరణ్,డిజిఎం సివిల్ ప్రసాద్ రావు,ఐటి మేనేజర్ నారాయణ,ఫైనాన్స్ మేనేజర్ శ్రీధర్,ఐఈడి అధికారి యోహాన్,పర్చేస్ ఆఫీసర్ రాజాజీ,డివైపియం రాజేశ్వర్,రామశాస్త్రి,ఇతర అధికారులు జియం కార్యాలయ సిబ్బంది అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment