కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 13 ; రెబ్బెన ; బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి టౌన్షిప్ సింగరేణి పాఠశాల మైదానంలో ఈ నెల 21వ తేదీన జరిగే ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జెనరల్ మేనేజర్ కె రవిశంకర్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున జీఎం కార్యాలయంలో ఏరియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్బంగా వారు మాట్లాడుతూ యోగా డే ను విజయవంతం చేసేందుకు ఏరియాలోని అన్ని గనులు డిపార్టుమెంట్లు జీఎం కార్యాలయ సిబ్బంది మరియు కాలనీల్లో యోగా శిక్షణ తరగతులు ఈ నెల పదిహేడో తేదీ నుండి ఇరవై ఒకటి తేదీ వరకూ కొనసాగుతుందన్నారు. యోగాడే సందర్భంగా ఈ నెల 21వ తేదీన సాయంత్రం 3 గంటలకు జిఎం కార్యాలయం నుండి యోగా రన్ తో బయలుదేరి కాలనీల గుండా సాగి సింగరేణి పాఠశాల మైదానంకు చేరుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కార్మికులు వారి కుటుంబ సభ్యులు అధికారులు,యూనియన్ నాయకులు క్రీడాకారులు,ఈ రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్లు జి మోహన్ రెడ్డి, శ్రీనివాస్, టిబిజికెఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ కిరణ్ కుమార్, డిజిఎం సివిల్ ప్రసాదరావు,డివైసిఎంవో అశోక్ కుమార్, డీవైపీఎంలు సుదర్శన్, రాజేశ్వర్, రామశాస్త్రి ఐఈడి ఆఫీసర్ యోహాన్, ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి, యోగా శిక్షకులు రాజలింగు, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment