Friday, 8 June 2018

మనిషిని మహాన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 8  రెబ్బెన :  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన  బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం రెబ్బెన మండలంలోని పులికుంట  ఎంపిపిఎస్ పాఠశాలలో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ మనిషిని మహానతుడిగా తీర్చిదిద్దేది చదువు ఒక్కటే అన్న జ్జ్యోతి బాపులే స్ఫూర్తికి     మొదటి అడుగుగా  బడీ ఈడు పిల్లల్నీ బడి బాట పట్టించే విధంగా  గ్రామంలోని పిల్లలకు సామూహిక    అక్షరాభ్యస కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అదే విధంగా మండలంలోని వంకులము గ్రామంలో కూడా బడిబాట కార్యక్రమంలో సామూహిక  అక్షరాభ్యాస  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలొ  పాఠశాల కమిటీ చైర్మన్ పోషణ విటిడిఎ చైర్ పర్సన్ లక్ష్మి, ఉపాధ్యాయులు స్వప్న, శ్రీనివాస్ గౌడ్ సీఆర్పీ సత్యనారాయణ గ్రామస్తులు సుధాకర్, గోపాల్, భీమయ్య,   వంకులములొ ప్రధానోపాధ్యాయురాలు డి జ్యోతి ఉపాధ్యాయులు జనార్థన్ ఏం  కమలాకర్ రెడ్డి అనసూయ పుష్ప స్వరూప వీణా విద్యార్థులు గ్రామస్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment