కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21 రెబ్బన;; అంతర్జాతీయ యోగా దినోత్సవము సందర్భంగా రెబ్బెన మండలంలో గోలేటిలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ముందుగా యోగ రన్ సింగరేణి జీఎం కార్యాలయం నుండి పాఠశాల మైదానం వరకు నిర్వహించారు. అనంతరం పాఠశాల మైదానంలో విద్యార్థిని, విద్యార్థులు యోగ లోని పలు ఆసనాలను ప్రదర్శించారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ కె రవిశంకర్, సేవ అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్ లు మత్లాడుతూ ప్రతిరోజూ యోగ చేయడంవలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. యోగతో ఆరోగ్యము మెరుగు పరచుకోవచ్చని, ఆరోగ్యవంతమైన సమాజం దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. రోగాలను దూరంచేసి ఏకైక మార్గం యోగ అని దీనిని ఉచితంగా నేర్చుకొని బాల , బాలికలు ఆరోగ్యాన్ని పొందాలని ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ కిరణ్, డిజిఎం సివిల్ ప్రసాదరావు, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కృష్ణ చారి, డి వై. పి.ఎం.రాజేశ్వర్, రామ శాస్త్రి, సేవ సభ్యులు సొల్లు లక్ష్మి, కుందారపు శంకరమ్మ, సేవ యోగ సభ్యులు, జి.ఎం. కార్యాలయ సిబ్భంది యోగ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment