Friday, 1 June 2018

జిల్లా విద్యాధికారి ఆకస్మిక తనిఖీ

కొమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లావిద్యాధికారి రఫీక్  శుక్రవారం  ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రావతరణ ఐన  జూన్ 2 న ఉదయం 8. 30 గంటలకు పతాకావిష్కరణ గావించాలన్నారు. విద్యార్థి, విద్యార్థినులకు ఆటల   పోటీలు నిర్వహించిమిఠాయిలు పంచాలన్నారు. . పాఠశాలా ఆవరణను ప రిశుబ్రంగా చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయురాలు,ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి విద్యార్థులకు మెరుగైన విద్యనందించినప్పుడే పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్చడానికి ముందుకు వస్తారన్నారు. ఈ విద్య సంవత్సరంలో 10 వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని  ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలతకు  సూచించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సహాయ సంచాలకులు ఉదయబాబు తోపాటు  తదితరులు   ఉన్నారు.

No comments:

Post a Comment