కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 13 ; రెబ్బెన: తెరాస పాలన రైతులను మోసం చేస్తుందని భాజపా కృష్ణ,గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాద్ అన్నారు.బుధవారం రెబ్బెన మండలంలోని గోలేటి జిల్లా కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతు తెరాస ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధరలు కల్పించడం లేదన్నారు.జిల్లా కేంద్రం లో 33 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను కేవలం 24 కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉంచారన్నారు.రైతు బంధు వల్ల సన్న చిన్న కారు రైతులకు ఎలాంటి లాభం చేకూరలేదని కేవలం భూస్వాములకు మాత్రమే లబ్ది జరిగిందన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష రుణమాఫీ నాలుగు విడతల వల్ల అది కేవలం వడ్డీకే సరిపోయిందన్నారు.కేంద్రం భాజపా ప్రభుత్వం 11.500 లక్షల కోట్ల బడ్జెట్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లో మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు.ఇటు తెలంగాణ రైతాంగ సమస్యలపై భాజపా ఉద్యమం చేపట్టి తగు న్యాయం చేస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జెబి పౌడెల్,చక్రపాణి అసెంబ్లీ కన్వీనర్,కిషన్ గౌడ్ బిజెపి నాయకుడు,కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment