కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 ; రెబ్బన ; కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి సింగరేణి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా రెబ్బెన కు చెందిన దీకొండ సాయితేజ ఉద్యోగం సాధించారు . ఏప్రిల్ 15 న ఉద్యోగం కోసం పరీక్ష రాశారు. అదే రోజు తెలంగాణా రాష్ట్రములో 18 వ ర్యాంక్ వచ్చింది . కొత్తగూడెం కార్పొరేటు కార్యాలయములో అధికారులు ఈ నెల 27 న మందమర్రి ఏరియా కు ఆర్డరు పత్రాన్ని ఇచ్చారు . గురు వారము సాయితేజ మందమర్రి జీఎం కు రిపోర్ట్ చేసి ఉద్యోగములో చేరారు. జిల్లా నుండి ఒక్కడే ఈ ఉద్యోగం సాదించడము తో బెల్లంపల్లి సింగరేణి అధికారులు , జిల్లా అధికారులు , మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .దీకొండ సాయితేజ విజయ కుమారి సంజీవ్ కుమార్ దంపతుల ఏకైక కుమారుడు. తండ్రి సంజీవ్ కుమార్ ప్రైవేట్ పాఠశాల ను నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుమారుడు సాయితేజ 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్వంత పాఠశాల సాయి విద్యాలయం హై స్కూల్ గోలేటిలోనే విద్యాభ్యాసం చేశారు .10 వ తరగతి లో 600 మార్కులకు గాను 508 మార్కుల తో 84.6 % సాధించారు అనంతరం కరీంనగరులోని ట్రినిటీ కళాశాలలో పూర్తి చేశారు. ఇంటర్ మెడియటే చదువు ను పూర్తి చేశారు. ఇంటర్లో 1000 మార్కులకు గాను 939 మార్కులతో 94 %, బి టెక్ మైనింగ్ లో 6363 మార్కులకు గాను 4869 మార్కుల తో 77 % సాధించారు. ఎమ్సెట్ ద్వారా కె ఎస్ ఎం (కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్) కాకతీయ యూనివర్సిటీలో క్యాంపస్ సీటు సాధించారు.4 సంవత్సరాలు మైనింగ్ కోర్సు 2017 మే లో పూర్తి చేశారు. అదే విదంగా 10 వ తరగతి లో సాక్షి దిన పత్రిక వై ఎస్ ఆర్ ఫౌండేషన్ వారు నిర్వహించిన మండల స్థాయి పోటీల లో 2 వ బహుమతి సాధించారు. థైక్వండో కరాటే పోటీల లో ఎపి ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్ షిప్2006 లో ప్రథమ బహుమతి సాధించారు . ది భారత్ స్కౌట్ ఓ 2010 లో సింగరేణి ఆద్వర్యములో నిర్వహించిన పోటీలలో మంచి ప్రతిభ ను కనబర్చారు . 2010-11 లో 13వ సుబ జూనియర్ నేషనల్ సెపక్ తక్రా ఛాంపియన్ షిప్ పాల్గొన్నారు. తల్లి తండ్రుల సహాకారం తో రిటడ్ స్వచ్చంద సంస్థకు ఆర్ధిక సహాయము చేశారు. అసిస్టెంట్ మేనేజర్ గా ఎంపికైన దీకొండ సాయితేజ మాట్లాడుతూ సింగరేణి సంస్థ పురోగాబివృద్ధికి తోడ్పడుతూ సంస్థకు పేరు ప్రతిష్టలు తెస్తానని అన్నారు.
No comments:
Post a Comment