Wednesday, 6 June 2018

సహకార సంఘంలో జిలుగు విత్తనాలు పంపిణి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 6  రెబ్బెన: మండల వ్యవసాయ  కేంద్రలో బుధవారం ఎంపిపి సంజీవ్ కుమార్,జెడ్పిటిసి బాపురావు లు  జిలుగు విత్తనాలు పంపిణి కార్యక్రమాన్ని  ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వ్యవసాయ సహకార కేంద్రం లో ఉన్న జిలుగు విత్తనాలను వినియోగించుకొని పంటలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.జిలుగు విత్తనాలు నాటి భూమిని దున్నటం వల్ల భూసారం పెరిగి ప్రధాన పంటల దిగుబడి పెరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో  సర్పంచ్ పేసరి  వెంకటమ్మ,మండల వ్యవసాయ అధికారిని మంజుల,ఏఎంసి వైస్  చైర్మైన్ కుందారపు శెంకరమ్మ,సింగిల్ విండో ఛైర్మెన్ గాజుల రవీందర్,సింగిల్ విండో డైరెక్టర్ మధునయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment