Friday, 15 June 2018

కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ దశలవారీగా పోరాటాలు ; వాసిరెడ్డి సీతారామయ్య

  • కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి 
  • కార్మిక సమస్యల అమలు చేయటంలో ప్రభుత్వం విఫలం


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 15  ; రెబ్బెన:  ఎన్నికల వాగ్దానాలు కార్మికులకు అమలు చేయటంలో ప్రభుత్వం విఫలం అయ్యాదని పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.  రెబ్బెన మండలం లోని గోలేటి కేఎల్ మహేంద్ర భవనంలో శుక్రవారం ఏర్పాటు  చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక సంఘాలను అవమాన పరిచిందన్నారు. పదో వేజ్బోర్డు ఏరియల్ చెల్లించే విషయంలో యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చించి చర్చించకుండా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కారుణ్య నియామకాల పేరిట అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించడంలో విఫలమైందన్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ విధానంతో పైరవీ కారి విధానాన్ని ప్రోత్సహించేలా కొంతమంది నాయకులు మెదులుతున్నారు. గతంలో కోల్ ఇండియాతో సంబంధం లేకుండా సింగరేణి 100 పర్సంట్ ఏరియర్స్ ఇప్పించామన్నారు. కార్మిక కష్ట ఫలితంగానే గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి  12 వేల కోట్ల  రూపాయలు లాభాలు గడించాయని అన్నారు. కార్మికుల ముప్పైశాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుడి సొంతింటి నిర్మాణానికి రూపాయలు పది లక్షల వడ్డీలేని రుణ బ్యాంకుల ద్వారా సింగరేణి యాజమాన్యమే ఇప్పించేందుకు కృషి చేయాలన్నారు. బదిలీల రికవరి మెంట్లలో కౌన్సిలింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్మిక సమస్యలను అధికారుల  దృష్టికి తీసుకెళ్లి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు  హైపవర్ కమిటీ వేతనాలు, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18 న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లో ధర్నాలు నిర్వహించి గనుల్లో ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే ఇరవై ఐదో తేదీన చలో కొత్తగూడెం పేరుతో కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టనట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రాంచ్ ఇంచార్జ్ ఈ నర్సయ్య,  బ్రాంచి  కార్యదర్శి ఎస్ తిరుపతి ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి ఆర్గనైజింగ్ కార్యదర్శులు చంద్రశేఖర్, జగ్గయ్య, సారన్నా, సత్యనారాయణ, శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శులు జూపాక రాజేష్, నరసింహరావు, ఓదేలు, ప్రభాకర్, కందుల మల్లేష్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment