కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 25; రెబ్బన ; సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సంస్థ లాభాలలో వాటా ఇవ్వాలని ఎస్ సి డబ్ల్యూ యు ఏఐటీయూసీ బ్రాంచ్ అధ్యక్షులు భోగే ఉపేందర్ అన్నారు. సోమవారం గోలేటి ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోనే సింగరేణి అతి పెద్ద సంస్థ అని సుమారు 25000 మంది కాంట్రాక్టు కార్మికులుగా చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారని వారికీ కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.సంస్థ అభివృద్ధికి వారి కృషి ఎంతో ఉందని, వారికీ సంస్థ లాభాలలో వాటా ఇవ్వాలని అన్నారు. హై పవర్ కమిటీ సిఫార్సుల మేరకు వారికీ వేతనాలు ఇవ్వాలని, 33 శాతం బోనస్ కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని అన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి అశోక్, సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్, కోశాధికారి వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment