Sunday, 3 June 2018

అక్రమ వసూళ్లకు పాల్పడిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 3  రెబ్బెన: : మండలంలోని  గోలేటి గ్రామం. సోనపూర్ సింగరేణి  భూనిర్వాసితులైన అమాయక ఆదివాసీ గిరిజనులను  నమ్మించి లక్షలాది రూపాయలు వసూలుకు పాల్పడి  మోసం చేసిన గోలేటి గ్రామ సర్పంచ్ తోట లక్ష్మన్  పై యస్ సి యస్ టి. అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని.భూనిర్వాసితులకు  తగు  న్యాయం చేయాలని తుడుం దెబ్బ.జిల్లా అధ్యక్షులు కోట్నక విజయ్. కోలం వార్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు అత్రం బీంరావు. గ్రామ పటెల్ అత్రం జంగు. అఖిల పక్షం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్. ఏఐటియుసి జిల్లా కార్యదర్శి భోగె ఉపేందర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగం బానయ్య, సిపిఐ నాయకులు రాయిల్ల నర్సయ్య. రామడుగుల శంకర్. రెబ్బెన పోలిస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేసారు. .అనంతరం వారు మాట్లాడుతు సింగరేణి  భూనిర్వాసితులైన అమాయక ఆదివాసీ గిరిజనులను రావాల్సిన  సింగరేణి భూనిర్వాసిత పైసలు ఇప్పిస్తానని నమ్మబలికి బ్లాంక్ చెక్కులపై సంతకాలు తీసుకొని వారికీ వచ్చిన పైసల్ని వారి ఖాతా నుండి తన ఖాతాలోకి   ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు తెలిపారు ఇలా సుమారు 30 మంది  ఖాతాల నుండి  10 లక్షలు వరకు  తీసుకుని మోసం చేసిన గోలేటి గ్రామ సర్పంచ్  లక్ష్మన్ పై చర్యలు తీసుకోవాలని అఖిల పక్షం తరుపున  డిమాండ్.చేస్తున్నట్లు తెలిపారు.పిర్యాదు ఇచ్చిన వారిలో కుమురం భీంరావు,కుమురం జలము,ఎడ్ల భీంరావు,ఆత్రం గంగు తదితరులు ఉన్నారు 

No comments:

Post a Comment