
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 2 ; రెబ్బెన; తెలంగాణ 4వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సింగరేణి సేవ సంస్థ ఆధ్వర్యంలో శెనివారం రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్లో ఆవిర్భావ వేడుకలను ఉదయాన్నే రన్ తో ప్రారంభించారు.అనంతరం సింగరేణి జియం కార్యాలయంలో జియం రవి శెంకర్ జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ కొరకు బలిదానాలు చేసిన వారిని స్మరించుకున్నారు.సాయంత్రం వేళలలో సింగరేణి పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాల స్టాళ్లను ప్రారంభించారు.ఈ సందర్బంగా మహిళలలకు,చిన్నారులకు,ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
No comments:
Post a Comment