కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 12 ; రెబ్బెన: మండలo నంబాల గ్రామానికి చెందిన కొవ్వూరు శ్రీనివాస్ ను భూమి సంబంధించి ఫోర్జరీ కేసులో మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రెబ్బన ఎస్సై శివ కుమార్ తెలిపారు. రెబ్బన ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నంబాల గ్రామానికి చెందిన చిట్ల పోషక్కకు నంబాల గ్రామ శివారులో 451/E సర్వే నెంబరులో గల 1 ఎకరం 65 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి ఇటు పోషక్కకు కానీ సంబంధిత సాక్షులకు గాని తెలియకుండా ఫోర్జరీ సంతకాలు చేసి కొవ్వూరి శ్రీనివాస్ తన పేరు మీద చేసుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన భూసర్వేలో చిట్ల పోషక్క భూమి కొవ్వూరి శ్రీనివాస్ పేరు మీద ఉన్నట్లు తేలింది. దీంతో బాధితురాలు 19-05-2018 తేదీన రెబ్బన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేసి మంగళవారం కొవ్వూరు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
No comments:
Post a Comment