18 వ తేదీ నుండి అన్ని గనులు, విభాగాల్లో యోగాభ్యాసం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 16 రెబ్బెన అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సింగరేణి వివిధ గనులు, విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కార్మికులందరికీ ఈనెల 18వ తేదీ నుంచి యోగా శిక్షణను ఇచ్చే యోగా శిక్షకులకు శనివారం గోలేటిలోని ఆఫీసర్స్ క్లబ్ లో శిక్షణ తరగతులు నిర్వహించినట్లు బెల్లంపల్లి ఏరియా అధికార ప్రతినిధి జె.కిరణ్ తెలిపారు. యోగా మాస్టర్లు రాజలింగు, ఉమారాణి ఆధ్వర్యంలో యోగా శిక్షకుల కోసం నిర్దేశిత ఆసనాలపై పున:శ‌్చరణ తరగతులు నిర్వహించారన్నారు. గనుల్లో, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులంతా దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకునేలా వారిలో ఆసక్తిని పెంచేలా శిక్షణ తరగతులను నిర్వహించాలని సూచించామని వెల్లడించారు.బెల్లంపల్లి ఏరియాలో 11 కేంద్రాల్లో యోగా శిక్షణ కోసం శిక్షకులను నియమించినట్లు తెలిపారు.యోగా తరగతులు నాలుగు రోజుల పాటు ఉంటాయన్నారు. యోగా దినోత్సవమైన జూన్ 21వ తేదీన గోలేటిలోని సింగరేణి పాఠశాల మైదానంలో సామూహిక యోగాభ్యాసం ఉంటుందని వివరించారు. యోగా తరగతులను అధికారులు, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్బంగా సూచించారు .
No comments:
Post a Comment