Tuesday, 5 June 2018

మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 3  రెబ్బెన: ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా మంగళవారం  రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లొ బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సెయింట్ ఆగ్నెస్  పాఠశాలలొ పిల్లల తో కలిసి మొక్కలు నాటడం  జరిగిందని తెలిపారు ఈ  సందర్భంగా బెట్టర్ యూత్  సంస్థ అధ్యక్షుడు ఓరగంటి రంజిత్ మాట్లాడుతు  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి   పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపైనా ఉందని అన్నారు.తల్లిదండ్రుల మరియు  పిల్లల  పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను  నాటి వాటిని  రక్షించే బాధ్యత తీసుకోవాలని వారు కోరారు. రోజు రోజుకు పర్యావరణం కలుషితం అవుతున్నందున  మొక్కల పెంపకం ద్వారానే దానిని నియంత్రించొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బెటర్ యూత్   సంస్థ సహాయ కార్యదర్శి జనగామ విజయ్, సభ్యులు బలుగురి తిరుపతి, విజయ్, పాఠశాల ప్రిన్సిపల్  కృష్ణకుమారి మరియు కరస్పాండెంట్ మాలిక్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment