Wednesday, 6 June 2018

తెరాస పార్టీ రాజకీయ పార్టీ కాదు ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ ; ఎమ్మెల్సీ పురాణం సతీష్


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 6  రెబ్బెన: తెరాస పార్టీ రాజకీయ పార్టీ కాదు,తెలంగాణ ఉద్యమ పార్టీ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ ఎన్నో సంక్షేమాలు ఏర్పాటు చేసి గడిచిన నాలుగేండ్ల నుండి ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతు అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు.మంగళవారం రాత్రి తక్కళ్లపల్లి నుండి రాళ్ళపాడు వరకు ఒక కోటి పద్నాలుగు లక్షల వ్యయంతో బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతు. రోడ్ల పాడు గ్రమస్థులకు ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు రోడ్డు పనులు ప్రారంభించామని అన్నారు. తెరాస ప్రభుత్వం  అభిరుద్ది పథంలో ముందుకు దూసుకు పోతుంది అని .తెరాస పాలనలో ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటూ అభివృద్ధి లో ముందుకు సాగుతుంది అన్నారు.తెరాస ప్రభుత్వం చేపట్టిన కల్యాణ లక్ష్మి పథకం,ఆసరా పింఛను,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ,24 గంటల కరెంటు,విద్య,రోడ్ల సదుపాయం,రైతు బంధు పథకం ద్వారా  ప్రతి రైతుకు ఎకరానికి 4 వేలు పంట పెట్టుబడి సహాయం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజలందరికి తెరాస ప్రభుత్వం అండగా ఉందన్నారు రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేస్తాము అన్నారు. గత ప్రభుత్వ పాలకులు ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తాం అని మాటలు చెప్పి మభ్య పెట్టి ఓట్లు దండుకొని పదవిని అనుభవించేవారు తప్ప వారు ప్రజలకు,గ్రమాలకు అభివృద్ధి చేసింది ఏమి లేదని ఘాటుగా విమర్శించారు.ఇప్పడికి అభివృద్ధిని ఓర్వలేక ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తుంటే విపక్ష నాయకులు అభివృద్ధికి అడ్డుపడుతు తెరాస పై విమర్శలు చేస్తున్నారు అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగా ప్రతి గ్రామానికి రోడ్లు,నీటి సౌకర్యం తెరాస ప్రభుత్వం కలిపిస్తుంది అని అన్నారు.అదేవిదంగా గత ప్రభుత్వాలు ఏ రోజు  ఆడబిడ్డ పెళ్లి కోసం ఆలోచించ లేదని నేడు తెరాస ప్రభుత్వం ఇంటికి పెద్దన్నగా కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డ పెళ్లి కోసం లక్ష రూపాయలు అందజేస్తుంది అన్నారు.రైతులకు ఎకరానికి రెండు పంటలకు 8 వేలు  పంట పెట్టుబడికోసం రైతు బంధు పథకం ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్ రోడ్లపాడు సబలో మాట్లాడుతుండగా సభకు హాజరైన గ్రమ ప్రజలు అందులో ఉన్న ఒక పెద్దావిడ పురాణం సతీష్ ప్రసంగానికి మధ్యలో మాట్లాడుతు  పుట్టిన నాటి నుండి ఈ గ్రమానికి రోడ్డు చూడ లేదు పోయే వరకు చూడలేనేమో అన్న పెద్దావిడ  ప్రశ్నకు ఎమ్మెల్సీ పురాణం సతీష్  వెంటనే స్పందించి అక్కడే ఉన్న రోడ్డు పనులకు సంబందించిన  జెఈ మరియు కాంట్రాక్టర్ ను సభ ప్రాంగణం వద్దకు పిలిచి రేపటి నుండి కచ్చితంగా రోడ్డు పనులు ప్రారంభించాలాని చెప్పి.ఆ పెద్దావిడ అడిగిన ప్రశ్నకు అప్పటికప్పుడు  పూర్తి భరోసాను కల్పించారు.అనంతరం మరో యువకుడు అడిగిన   కల్యాణ లక్ష్మి పథకం, కుల,నివాస మరియు ఆదాయం ద్రువీకరణ పత్రాలు అందించే విషయం లో  రెబ్బెన తహశీల్ధార్ కార్యాలయం నుండి తీవ్ర జాప్యం జరుగుతుంది అని అదేవిదంగా కల్యాణ లక్ష్మి పథకం అందించడం లో ప్రభుత్వ  కార్యాలయాల చుట్టు ఎన్ని సార్లు తిరిగిన పట్టించుకోవడం లేదని ఆ యువకుడు అడిగిన వెంటనే అప్పటికప్పుడు రెబ్బెన తహశీల్ధార్ సాయన్న ని చరవాణి ద్వారా సంభాషించి పెండింగ్ లో ఉన్న  కల్యాణ లక్ష్మి మరియు కుల నివాస పత్రాలు వెంటనే లబ్ది దారులకు అందించాలి అని ఇక ముందు పనులు పెండింగ్ లో  ఉంచకుండా సకాలంలో పూర్తి చేయాలనీ తహశీల్ధార్ సాయన్నకు సూచించారు.ఈ సందర్బంగా ఇతర పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తెరాస పార్టీలోకి చేరే వారిని ఎమ్మెల్యే కోవా లక్ష్మి,ఎమ్మెల్సీ పురాణం సతీష్ వారికీ  తెరాస కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో రెబ్బన ఎంపిపి కర్నాధం సంజీవ్ కుమార్,జడ్పిటిసి అజ్మీర బాపురావు,టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ,మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,నాయకులు చెన్నె సోమశేఖర్,రామన్న,పళ్ళ రాజేశ్వర్,సంగం శ్రీనివాస్,భీమేష్,పోతురెడ్డి, వార్డు మెంబర్ సభ్యులు,ఎంపిటిసిలు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment