కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 2 ; రెబ్బెన; మండలంలోని కొల్లేటి గ్రామంలో సోనాపూర్ గ్రామస్తులైన ఆదివాసులను మోసం చేసిన గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోగే ఉపేందర్ కాంగ్రెస్ నాయకులు సంఘం నాయలు గ్రామస్తులు సిడం భీం పటేల్ మరియు బాధితులు ఎట్ల భీమ్రావు కుమ్రం భీం రావు అన్నారు సోనాపూర్ గ్రామస్తులు ఇటీవల సింగరేణి యాజమాన్యం ఇచ్చిన నష్టపరిహారం నుండి ఆదివాసులను మోసం చేసి ఒక్కొక్కరి నుండి మూడు లక్షలు తీసుకు తీసుకున్నగోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు అమాయకులను మోసం చేసిన అధికార పార్టీ టీఆర్ సర్పంచ్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని పూర్తి విచారణ చేసి బాధితులకు తిరిగి డబ్బులు ఇవ్వాలని ఇంకా బాధితులు చాలామంది ఉన్నారని గిరిజనులను మోసం చేశారని అమాయక గిరిజనులకు మాయమాటలు చెప్పి వాళ్ళ నుండి డబ్బులు తీసుకున్న సర్పంచ్ తోట లక్ష్మణ్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేసరి ఆంజనేయులుగౌడ్ భోగ ఉపేందర్ ఎస్ బానయ్య బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment