Friday, 8 June 2018

రాష్ట్ర స్థాయి యోగ పోటీల్లో గెలుపొందిన వారిని అభినందించిన జియం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 8  రెబ్బెన : బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యోగ  పోటీల్లో గెలుపొందిన వారిని  శుక్రవారం జెనరల్ మేనేజర్ కె రవి శెంకర్ వారి కార్యాలయంలోఅభినందించారు.వీరు గోలేటి,మాదారం, బెల్లంపల్లిలో సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో  నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో  శిక్షణ పొంది గత సోమవారం హైద్రాబాద్ శేరిలింగంపల్లి లో యోగ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో  గెలుపొందారు. గెలుపొందిన వారిలో ఎన్ సన్నిహిత-గోల్డ్ మెడల్,,పి వెంకట రమణ --గోల్డ్ మెడల్,బోయ ఉమారాణి-గోల్డ్ మెడల్,డి బాలయ్య-గోల్డ్ మెడల్,కె శిరీష -సిల్వర్,కె అలేఖ్య -సిల్వర్ బహుమతులు గెలుచుకున్నారు.ఈ అభినందన కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ కె కొండయ్య,ఎస్ ఓటు జియం హెచ్ వీరాస్వామి,డిజిఎం పర్సనల్ జె కిరణ్,డివైపియం ఏ రాజేశ్వర్,రాష్ట్ర  యోగ ప్రెసిడెంట్ రాజలింగు,రాష్ట్ర కోచ్ బోయ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment