Sunday, 3 June 2018

విద్య శాఖ మరియు పోలీస్ ల అద్వర్యం లో మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ ఎంపిక

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 3  రెబ్బెన: తెలంగాణ రాష్ట్రము లోని స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశం కోసం  జిల్లా హెడ్ క్వార్టర్ నందు పోలీసులు మీకోసం లో బాగముగా  జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చేతుల మీదుగా ప్రారంబించబడిన స్పోర్ట్స్ స్కూల్  సెలక్షన్ టెస్ట్ ను రెబ్బెన, తిర్యాని  మండలం యొక్క అభ్యర్థులకు తేదీ  04-06-2018  సోమ వారం నాడు ఉదయం 8 గంటలకు  రెబ్బెన మండలం గోలేటి లోని స్థానిక సింగరేణి క్రీడా మైదానం  నందు నిర్వహించబడునని ఆదివారం  ఎస్సై శివ కుమార్ మరియు యం.ఇ.ఓ వెంకటేశ్వర స్వామి లు ఒక ప్రకటనలో  తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు రెబ్బెన, తిర్యాని  మండలం లో గల విద్యార్థులు  01.09.2009  నుంచి  31.08.2010 (7 ½ సంవత్సరాల  నుంచి 9 సంవత్సరాల వయసు)   మద్య జన్మించిన మూడు, నాలుగు, అయిదు  తరగతు లుచదివే  వారు అర్హులని ఇందుకు రెబ్బెన, తిర్యాని మండలం లో గల  అన్ని ప్రైవేటు , గవర్నమెంట్, ప్రైమరీ మరియు ఆశ్రమ పాఠశాల ల విద్యార్థులు మరియు సంబందిత పాఠశాల ల ఉపాద్యాయులు,పిడి, పిఇటిలు లు తప్పక  ఈ యొక్క  సెలక్షన్ టెస్టుకు   హాజరు కావాల్సింది గా  ఎస్సై శివ కుమార్ మరియు యం.ఇ.ఓ వెంకటేశ్వర స్వామి లు కోరారు.

No comments:

Post a Comment