కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 9 రెబ్బెన : మండల కేంద్రంలోని గోలేటి గ్రామంలోని కోదండ రామాలయంలో అంగన్వాడి కేంద్రంలో 3 సంవత్సరాల పిల్లలకు అక్షరాబ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా సంక్షేమ అధికారిని కె సావిత్రి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ సంప్రదాయ బద్దంగా పిల్లలకు అక్షరాబ్యాస కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ నటి ఈ నాటి పిల్లలే రేపటి దేశ భవిష్యత్తు అని అన్నారు. ఈ సందర్బంగా తెరాస మండలాధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి పిల్లలకు పలకలను అందించి స్వీట్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అజ్మేర బాపురావు, సూపర్వైజర్ సరోజినీ దేవి, ఏడబ్ల్యూటిఎస్ సంధ్యారాణి,సుశీల,భాగ్యలక్ష్మి,రుక్కుబాయి,మంజుల,స్వర్ణలత,మల్లేశ్వరి,విజయ, చంద్రకళ, బాలమ్మ, సాంబాలక్ష్మి, తిరుపతమ్మ, రాజేశ్వరి తదితర పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment