కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 11 ; రెబ్బెన: విద్యార్థుల సమస్యలు తెలుసుకుని పోరాటం చేయాడం లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ముందు ఉంటుందని నూతనంగా ఎన్నికైన ఏఐఎస్ఎఫ్ డివిజన్ ఉపాధ్యక్షుడు పర్వతి సాయి కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.నంబాల గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న పర్వతి సాయికుమార్ ను ఏఐఎస్ఎఫ్ డివిజన్ ఉపాధ్యక్షుడి గా ఎన్నుకున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ మరియు డివిజన్ కార్యదర్శి పూదరి సాయి కిరణ్ ఈ సందర్బంగా తెలిపారు.అనంతరం ఏఐఎస్ఎఫ్ డివిజన్ ఉపాధ్యక్షుడు పర్వతి సాయి కుమార్ మాట్లాడుతు.విద్యారంగ సమస్యలపై నిరంతరం విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అలాగే ఆసిఫాబాద్ డివిజన్ లో డీగ్రీ కాలేజీ లేకపోవడం వలన విద్యార్థులు చాల ఇబ్బందులకు గురిఅవుతున్నారని అన్నారు. వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనీ లేకపోతే ఏఐఎస్ఎఫ్ తరుపున అనేక ఉద్యమాలు చేపడుతామని అన్నారు.తనపై నమ్మకంతో బాధ్యతను అప్పజెప్పిన జిల్లా డివిజన్ కార్యదర్శులు దుర్గం రవీందర్ పూదరి సాయి లకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment