కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 రెబ్బెన ; ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరీక్షించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆద్వర్యలంలో డివిజన్ ఉపాధ్యక్షుడు పర్వతీ సాయి సోమవారం మండల విద్యాధికారి కి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో త్రాగు నీరు సదుపాయం త్రాగు నీటి సదుపాయం,పాఠశాలల్లో మరుగుదొడ్లు, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్న కూడా వాటిని నిరుపయోగగంగా ఉంచడం వల్ల విద్యార్ధి,విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని ఉన్న మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చి లేని పాఠశాలల్లో నిర్మించాలని అన్నారు. పిల్లల మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించాలని దానితోపాటు ఉపాధ్యాయులు సమయపాలన పాటించే విదంగా చూడాలని అన్నారు. మండలంలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి రాకపోవడంతో పిల్లలు సరిగ్గా చదవలేక పోతున్నారని ఈ సందర్బంగా తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిశీలించి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కల్పించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల దోపిడీని అర అరికట్టాలని అలాగే కొన్ని ప్రైవేటు పాఠశాలల దోపిడీకే పరిమితం అయ్యాయని అన్నారు. దోపిడీలను అరికట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే విధంగా చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాడి సాయి, మండల ఉపాధ్యక్షుడు బెజ్జం అనుదీప్, రాజేష్, సాయి, హరీష్, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment