కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 9 రెబ్బెన : నకిలి పత్తి విత్తనాలు ఇండిగో కారులో హైదరాబాద్ నుండి అక్రమంగా తరలిస్తున్నవ్యక్తులను శెనివారం రెబ్బెన రైల్వే గేటు కమాన్ చేర్చ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 150 కిలోల సుమారు 2,40,000 విలువ కల నకిలి పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు ఎస్ఐ శివ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా నాగార్జున రెడ్డి అను వ్యక్తి హైదరాబాద్ నుండి అరుణ్ కుమార్ యొక్క ఇండిగో కారును అద్దెకు తీసుకొని నకిలీ పత్తి విత్తనాలు తీసుకోని బిమిని మరియు ఇతర గ్రామాలతో అమ్ముటకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment