కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 3 రెబ్బెన:బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించె బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయుల తో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల భాద్యత అని మండల విద్యాధికారి ఎం వెంకటేశ్వర స్వామి అన్నారు. ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం రెబ్బెన ప్రాథమిక పాఠశాల లో 1వ తరగతి విద్యార్థుల నమోదుని పరిశీలించి తదుపరి వారు మాట్లాడుతు ఉపాధ్యాయులు బాల బాలికల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించాలని, మండలం లో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాద్యాయులు బడి బాటలో భాగంగా రోజువారి కార్యక్రమాలని నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై సోమశేఖర్, ఉపాద్యాయులు మంజుల,ఎం.వీ.యన్ కుమార్, సీఆర్పీలు యం.దేవేందర్,యం రాజేష్,వీ సత్యనారాయణ పాల్గొన్నారు.
No comments:
Post a Comment