కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 11 ; రెబ్బెన మండలంలోని ఖైర్గం గ్రామంలో మిషన్ భగీరథ పనులలో మదీనా మసీదు ప్రహరీ గోడను కూల్చివేశారని, ఆ ప్రహరీ గోడను తిరిగి నిర్మించాలని ఆసిఫాబాద్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఉబేద్ బిన్ యాహియా సోమవారం మండల తహసీల్దార్ సాయన్నకు వినతి పత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టి సంస్థవారు పనులలో భాగంగా ప్రహరీ గోడను కూల్చివేశారని అప్పటి నుండి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని గౌరవ రెబ్బెన తహసీల్దార్ కల్పించుకొని ఎల్ అండ్ టి సంస్థవారు ఆ ప్రహరీ గోడ నిర్మించేటట్లు చూడాలని.అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జమీల్ హుస్సేన్, సభ్యులు సయ్యద్ సెభాష్ ,మీర్ ఖలీఫ్ అతిషి , మీర్ ఖసీఫ్ అలీ, ఉబేద్ అల్లాహ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment